సమాజంలో చిచ్చుకు యత్నం

share on facebook

కరీంనగర్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం హిందూ సమాజంలో చిచ్చుపెట్టడమే అవుతుందని  భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ అన్నారు. ముస్లింలలో పేదలు ఉన్నారని వారికి ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లను తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. బీసీ కవిూషన్‌ ఇతర మతస్థులను బీసీ జాబితాలో చేర్చడాన్ని అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయాలని అనుకుంటే పేదలకు రెండుపడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, దళితులు మూడు ఎకరాల పంపిణీ, రైతులకు ఒకే సారి రుణమాఫీ చేయాలని అన్నారు.  మతపరమైన రిజర్వేషన్లు కల్పించవద్దని రాజ్యాంగంలో ఉందని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు.

Other News

Comments are closed.