సమిష్టి కృషితో విజయం సాధించాం

share on facebook

– ఇలాంటి జట్టు ఉంటే కెప్టెన్సీ తేలికవుతుంది
– బంగ్లాదేశ్‌ గట్టిపోటీ ఇచ్చింది
– విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ
దుబాయ్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : ఆసియాకప్‌లో మరోసారి విజేతగా నిలవడం పట్ల టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. తుది పోరులో మిడిల్‌ ఆర్డర్‌దే కీలక పాత్రగా రోహిత్‌ పేర్కొన్నాడు. తమ జట్టు ఒత్తిడిలో పడ్డ సమయంలో మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఆకట్టుకుని విజయం ఖాయం చేశారన్నాడు. ఓవరాల్‌గా చూస్తే తమ ఫినిషింగ్‌ లైన్‌ అద్భుతంగా ఉందన్నాడు. మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ప్రధానంగా చూస్తే తొలి 10 ఓవర్లలో బంగ్లా ఆటగాళ్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారని అన్నారు. అయితే బంతి కాస్త పాత బడిన తర్వాత స్పిన్నర్లు రాణించే అవకాశం ఉందని ముందే ఊహించామని, మేము ఏదైతే అనుకున్నామో.. అదే జరిగిందని తెలిపారు. క్రమేపీ బంగ్లాను భారీస్కోరు చేయకుండా పైచేయి సాధించామన్నారు. ఇక్కడ జట్టుగా సమష్టికృషి లేకపోతే టైటిల్‌ను గెలవడం అంత ఈజీ కాదన్నారు. ఈ టైటిల్‌ సాధించడంలో క్రెడిట్‌ అంతా మొత్తం జట్టుదేనన్నారు. ఈ తరహా జట్టు ఉన్నప్పుడు కెప్టెన్‌ పాత్ర అనేది సులభతరంగానే ఉంటుందని రేవంత్‌ తెలిపారు. టోర్నీ ఆద్యంతం మా వాళ్లు అసాధారణంగా రాణించారని, అదే సమయంలో మాకు మద్దతు కూడా విశేషంగా లభించిందని రోహిత్‌ తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని రోహిత్‌ పేర్కొన్నాడు.
ఫీల్డింగ్‌ తప్పిదాలతోనే ఓడిపోయాం – బంగ్లాదేశ్‌ కెప్టెన్‌
ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగానే భారత్‌ చేతిలో తమ జట్టు ఓడిపోయిందని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మొర్తజా ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మొర్తజా మాట్లాడుతూ ‘చివరి బంతి వరకూ పోరాడామని, కానీ.. మ్యాచ్‌లో చాలా ఫీల్డింగ్‌ తప్పిదాలు చేశామన్నారు. కనీసం 260 స్కోరు చేయాలని టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌కి సూచించామని, అయితే.. వారు 222 స్కోరుతోనే సరిపెట్టారన్నారు. అయినప్పటికీ.. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారన్నారు. ఒకవేళ
240 స్కోరు చేసి ఉండింటే మా జట్టు గెలిచేదేమో అని పేర్కొన్నారు. కొన్ని ఫీల్డింగ్‌ తప్పిదాలతో మ్యాచ్‌ని చేజార్చుకున్నాంమని మొర్తజా వెల్లడించాడు.

Other News

Comments are closed.