సర్పంచ్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం

share on facebook

గులాబీ నేతలనే గెలిపించాలి

రంగారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): రైతులను రాజుగా చూడాలనేది సీఎం కేసీఆర్‌ కల అని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాష్ట్రలోని గ్రామాలు టిఆర్‌ఎస్‌ ద్వారానే అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే ఆనంద్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని చూసి అఖండ మెజార్టీతో గెలిపించిన ఘనత సైతం విూదే అన్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికల్లో సైతం పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్ర తి కార్యకర్త పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే సయమంలో అభివృద్ధి చేసే అభ్యర్థులను గుర్తించాలన్నారు. ప్రతి పక్ష పార్టీల నాయకులు ప్రజలను మోసగించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్‌ నాయకులు పాల్గొన్నారు.దోర్నాల్‌ పాఠశాలను సందర్శించి హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన పలు విషయాలు తెలుసుకున్నారు. దోర్నాల్‌ అర్థాంతరంగా నిలిచిపోయిన ఊర్దూ విూడియం పాఠశాలను ఆయన సందర్శిం చి పరిశీలించారు. భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు కుటుంబం నుంచి వచ్చినవారే కాబట్టి రైతులకు ఉండే కష్టాలను తెలుసుకొని 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రైతుబంధు పథకంలో పంట పెట్టుబడికి ఎకరాకు రూ.4వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.8వేలు అందజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనం అందిస్తుందన్నారు. ప్రజలకు కంటి వెలుగు పథకంతో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తుందన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికీ నీటి సౌకర్యం కల్పించి శాశ్వత నీటి కష్టాలను తొలిగించిందన్నారు. గ్రామా ల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు.

Other News

Comments are closed.