సార్క్‌ సదస్సుకు మేము రాం

share on facebook

untitled-1

– భారత్‌ బాటలోనే బంగ్లా, ఆఫ్ఘన్‌, భూటాన్‌

– శిఖరాగ్రసదస్సు నిర్వహణ అనుమానమే

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి):  భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగబోయే సార్క్‌ శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇతర సార్క్‌ దేశాలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. సార్క్‌ సదస్సుకు హాజరు కాబోరాదని ప్రధాని మోడీ నిర్ణయించారు. నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగబోయే సార్క్‌ 19వ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అసలు సదస్సు జరుగుతుందో లేదో అన్న సందిగ్ధత ఏర్పడింది. సార్క్‌ నిబంధనల ప్రకారం సభ్య దేశాల్లో ఒక దేశాధినేత రాకపోయినా సదస్సు నిర్వహించడానికి వీల్లేదు. దీంతో వివిధ భాగస్వామ్య దేశాలు హాజరుకావడం లేదు. ఇప్పుడు భారత్‌ బాటలోనే మరికొన్ని దేశాలు కూడా సదస్సుకు విముఖత వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్‌, ఆప్గనిస్థాన్‌, భూటాన్‌ దేశాలు కూడా సార్క్‌ సమావేశాలకు హాజరుకావద్దని నిర్ణయించుకున్నాయి. సభ్యదేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకుంటోందని అందుకే తాము సార్క్‌కు హాజరుకాలేమని బంగ్లాదేశ్‌ భావిస్తోంది. ఈ మేరకు సార్క్‌కు నేతృత్వం వహిస్తున్న నేపాల్‌కు బంగ్లాదేశ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే కారణంతో ఆఫ్గాన్‌, భూటాన్‌లు కూడా సార్క్‌కు రావడం లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో సార్క్‌ సదస్సులో పాక్‌ ఒంటరిగా మిగిలిపోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా దేశాల నిర్ణయంతో నవంబర్‌ లో పాకిస్తాన్‌ లో జరుగవలసిన సార్క్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రశ్నార్థకరంగా మారింది. గత నెల ¬మ్‌ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ పాకిస్తాన్‌ లో సార్క్‌ ¬మ్‌ మంత్రుల సదస్సుకు వెళ్లిన సందర్భంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. దానితో, తాజాగా యూరి వద్ద మన సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరగడంతో భారత్‌ ఈ సదస్సును బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాజ్‌ నాథ్‌ సింగ్‌ పర్యటన తరువాత జరిగిన సార్క్‌ దేశాల ఆర్ధిక మంత్రుల సదస్సుకు అరుణ్‌ జైట్లీ వెళ్లకుండా భారత్‌ ప్రతినిధిగా శక్తికాంత దాస్‌ పాల్గొన్నారు. ఆ తరువాత సార్క్‌ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ  హాజరు కావచ్చనే వార్తలు వ్యాపించాయి. మోడీ ఇస్లామాబాద్‌ రావడానికి సుముఖంగా ఉన్నారని అంటూ పాకిస్తాన్‌ లో భారత్‌ హై కవిూషనర్‌ గౌతమ్‌ బంబావాలే సంకేతం ఇచ్చారు. అయితే వెంటనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదని విదేశాంగా శాఖ వివరణ ఇచ్చింది. ఈలోగా యూరి దాడి జరగడంతో ప్రధాని పాకిస్తాన్‌ వెళ్లరని ప్రకటించారు. భారత్‌ కు సంఘీభావంగా సార్క్‌ సదస్సును బహిష్కరించాలనే సంకేతాన్ని ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌, బాంగ్లాదేశ్‌ లు ఇచ్చాయి. భూటాన్‌ కూడా ఈ సదస్సుకు గైరుహాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  పాకిస్తాన్‌ ను ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు ఉంచాలని పలు దక్షిణాసియా దేశాలు భావిస్తున్నాయి. దానితో పాకిస్తాన్‌ ను ఏకాకి చేయాలనే భారత్‌ వ్యూహం అమలుకు సానుకుల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పలు దేశాలు బహిష్కరిస్తే అసలు సదస్సే రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలి

పాకిస్థాన్‌ను ఐఉగ్రవాద దేశంగా ప్రకటించాలని బంగ్లాదేశ్‌ దౌత్య అధికారి క్యరాజ్య సమితిని కోరారు. సార్క్‌ చరిత్రలోనే తొలిసారి ఎనిమిది దేశాల్లో నాలుగు దేశాలు సమావేశానికి హాజరుకావడానికి నిరాకరించడం చాలా తీవ్రమైన అంశమని.. దీన్ని చాలా బలమైన సందేశంగా గుర్తించాలని భారత్‌లోని బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌ సయ్యద్‌ మౌజెమ్‌ అలీ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా పాకిస్థాన్‌ను గుర్తించి అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఏకాకిని చేయాలన్నారు. భవిష్యత్తులో విదేశీ పాలసీల అంశంలో పాక్‌ ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటుందో ఇక ఆ దేశ ఇష్టమని ఆయన తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ ఘటన అనంతరం పాక్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాలని భారత్‌ కోరుతున్న సంగతి తెలిసిందే. యూరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌లో జరిగే సార్క్‌ సమావేశాలకు భారత్‌ హాజరుకావొద్దని నిర్ణయించింది. అయితే భారత్‌కు మద్దతుగా బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, భూటాన్‌లు కూడా సమావేశాలకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్‌ సహాయం చేయడం వెంటనే ఆపేయాలని సయ్యద్‌ అలీ అన్నారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *