సాహాకు అవకాశం లేనట్లేనా?

share on facebook

– షాకిచ్చిన బీసీసీఐ.. మళ్లీ జట్టులోకి కష్టమే!

న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు బీసీసీఐ షాకిచ్చింది. ఎంఎస్‌ ధోనీకి ప్రత్యామ్నాయంగా భావించిన కీపర్‌ సాహా.. కానీ గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో ఐపీఎల్‌ ఆడిన తర్వాత జాతీయ జట్టులోకి రాలేదు. మరోవైపు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌. అయితే గాయాలనుంచి కోలుకున్న సాహా జట్టులోకి వచ్చేందుకు మరింత రాటుదేలాలని భావిస్తున్నాడు. అయితే సాహా చేసిన అభ్యర్థనను బీసీసీఐ తోసిపుచ్చింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడవిూ (ఎన్‌సీఏ)లో భారత మాజీ క్రికెటర్‌, కీపర్‌ విజయ్‌ యాదవ్‌తో శిక్షణ పొందాలని భావించాడు. ఈ మేరకు బీసీసీకి ఓ లేఖ పంపాడు సాహా. ఎన్‌సీఏ రెగ్యూలర్‌ కీపింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మ కాగా, ఆయన భారత్‌ ఏ జట్టుకు సేవలందిస్తున్నాడు. విజయ్‌ యాదవ్‌ వద్ద ట్రైనింగ్‌ తీసుకునేందుకు సాహాకు బీసీసీఐ అనుమతి నిరాకరించింది. భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే వద్ద శిక్షణ తీసుకోవాలని సూచించింది. యువ ఆటగాళ్లకు సైతం ట్రైనింగ్‌ ఇచ్చేందుకు కిరణ్‌ మోరే ఎన్‌సీఏకు టచ్‌లో ఉండే వ్యక్తి అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. దీనిపై కిరణ్‌ మోరే స్పందించాల్సి ఉంది. అయితే గతేడాది జనవరిలో జరిగిన కేప్‌టౌన్‌ టెస్టు తర్వాత సాహా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. అనంతరం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగాడు. గాయాలతో సాహా వైదొలగడంతో అతడి ఫిట్‌నెస్‌పై బీసీసీఐకి అనుమానాలొచ్చాయి. ఈ క్రమంలో దినేష్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌లకు అవకాశాలిచ్చింది. పంత్‌ రెగ్యూలర్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గానూ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Other News

Comments are closed.