సింహాద్రి అప్పన్న సన్నిధిలో కేంద్రమంత్రి

share on facebook

స్వామి దర్శనం అపూర్వమన్న ప్రభు
విశాఖపట్టణం,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని కేంద్ర సురేశ్‌ప్రభు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. విశాఖ సిఐఐ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రభు స్వామివారి చెంతకు వచ్చారు. ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం ప్రదక్షిణ అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం విూడియాతో సురేశ్‌ ప్రభు మాట్లాడుతూ.. విశాఖలో గత రెండురోజులుగా జరుగుతున్న పెట్టుబడుల భాగస్వాముల సదస్సులో పాల్గొన్నానని.. అందులో భాగంగా స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో సింహాచలం అప్పన్నస్వామి దేవాలయం రెండోదని.. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామాన్ని దత్తత తీసుకోవడం తీసుకున్నానని.. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.

Other News

Comments are closed.