సిఎం హావిూలను అమలు చేయాలి

share on facebook

 

ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులతో ఎప్పటికైనా నష్టమేనని ఎఐటియూసి నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. అలాగే విఆర్‌ఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. గతంలో అర్హులుగా ఉన్న వారందరికి డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ఓసీపీల ద్వారా నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇవ్వాలన్నారు. సింగరేణిలో భూములు కోల్పోయిన వారికి భూములు ఇవ్వాలని, ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలన్నారు. సింగరేణి నష్టపోయిన గిరిజనులకు పునరావాసం, భూమిని చూపాలని, బతుకుదెరువు చూపాలన్నారు. హక్కులను సాధించుకోవడానికి సమష్టిగా ముందుగా రావాల్సిన అవసరం ఉందని

వాసిరెడ్డి అన్నారు. అడ్డగోలుగా ఉపరితల గనులను తవ్వి ప్రజలను నష్టపరచొద్దన్నారు. మనుషులకు నష్టం జరుగకుండా బొగ్గును తవ్వుకోవాలి, భవిష్యత్తులో ఓసీపీలు బందు చేయడం మేలన్నారు.సింగరేణితో జరుగుతున్న నష్టాన్ని గమనించాలని మరోవైపు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారసత్వ ఉద్యోగాలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని, త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు వస్తాయన్నారు. కార్మికులకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తెబొగకాసంకు దక్కుతుందన్నారు. ఒప్పంద కార్మికులకు హైపవర్‌ వేతనాలు ఇప్పిస్తామని కార్మికులను ధర్నాలకు, పోరాటాలకు వాడుకుంటున్న ఏఐటీయూసీ కోలిండియా స్థాయిలో

ఒప్పందం చేసుకున్నది నిజమైతే సింగరేణిలో ఎందుకు అమలు చేయించలేకపోతుందని ప్రశ్నించారు.

సింగరేణి కార్మికుల సొంత ఇంటి పథకం కల త్వరలో నేరవేరుస్తామని కూడా తెలిపారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడానికి సిఎం కెసిఆర్‌ అంగీకరించారని అన్నారు. సింగరేణి సంస్థకు లాభాల సిరులు కురిపిస్తున్న కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఏరియాలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రాతినిధ్య సంఘమైన ఏఐటీయూసీ వైఫల్యం చెందిందని ఆరోపించారు.

 

Other News

Comments are closed.