సీఎం ¬దాలో..  బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్‌

share on facebook


హైదరాబాద్‌, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : సీఎం ¬దాలో కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగాన్ని సుమారు గంట పాటు చదివి వినిపించారు. సీఎం ¬దాలో ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. ఉమ్మడి ఏపీతోసహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే స్వయంగా 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. చరిత్రను పరిశీలిస్తే.. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి సీఎంగా ఉంటూనే 1955-56, 1957-58 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ 1968-69, 1969-70 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 2010లో ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతూ 2010-11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, పద్దులను సభ్యులకు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు అదనంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో 2015-16లో ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌, కేరళలో 2016-17లో సీఎం ఉమెన్‌చాందీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్‌లో సీఎం వసుంధర రాజే, నాగాలాండ్‌లో సీఎం సీకే సంగ్మా స్వయంగా 2018-19 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా నలుగురు ముఖ్యమంత్రులు బడ్జెట్‌ ను శాసనసభ ముందు ఉంచారు. గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ జనవరి 30న బడ్జెట్‌ పెట్టగా.. ఈ నెల 8వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌, 9వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ జైరాం ఠాకూర్‌ ఆర్థికశాఖ మంత్రి ¬దాలో ఆయా రాష్ట్రాల బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
ప్రధాని ¬దాలోనూ పలువురు..
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఇందిర కుమారుడు రాజీవ్‌ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖను స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో బడ్జెట్‌ ను సమర్పించారు. 1958-59 ఆర్థిక సంవత్సరానికి జవరహర్‌ నెహ్రూ బడ్జెట్‌ ను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 1970-71 సంవత్సరానికి, రాజీవ్‌ గాంధీ 1987-88 కాలానికి బడ్జెట్‌ ను సమర్పించారు. యూపీఏ-1 హాయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ కూడా కొద్దికాలం ఆర్థిక శాఖను నిర్వహించారు. అయితే మన్మోహన్‌ సింగ్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టాల్సిన అవసరం రాలేదు.

Other News

Comments are closed.