సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు

share on facebook

ఎమ్మెల్సీ కవితను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు

 

తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్ గారికి ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సీఎం కేసీఆర్ గారికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను కలిసి ధన్యవాదాలు తెలిజేశారు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో 7,000 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఇంచార్జ్ రూప్ సింగ్, టీఆర్ఎస్ కేవి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.