సీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలి: బిజెపి

share on facebook

విజయవాడ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ నేత రఘునాథ్‌ బాబు డిమాండ్‌ చేశారు. బిజెపి కర్నూలు డిక్లరేషన్‌ మేరకు నడుచుకోవాలన్నారు. ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు అన్యాయం జరిగిన మాట వాస్తవమని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు అడగడంలో అర్థం ఉందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఉత్తరాంధ్ర, రాయలసీమలోనే ఎక్కువగా జరగాలని రఘునాథ్‌ బాబు డిమాండ్‌ చేశారు. రాయలసీమలో సుప్రీం కోర్టు బెంచ్‌, అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయమని సీఎం చంద్రబాబు అడగడంలో అర్థం లేదన్నారు. దేశానికి రెండో రాజధాని, సుప్రీం బెంచ్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చన్నారు.

Other News

Comments are closed.