సుధాకర్‌ను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు

share on facebook

ఖమ్మం,జూన్‌12(ఆర్‌ఎన్‌ఎ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏరియా న్యూ డెమోక్రసి చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత దళ కమాండర్‌ బొడా భీముడు అలియాస్‌ సుధాకర్‌ను విూడియా ముందు ప్రవేశ పెట్టారు. ఖమ్మం జిల్లా కుసుమంచి పోలీసులు అదుపులోకి తీసుకొని సిపి తప్సిర్‌ ఇక్బాల్‌ సమక్షంలో విూడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఎవరైనా బెదిరింపులకు పాల్పడి చందాలకు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇటీవలే సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశం లో ఏసిపి నరేష్‌ రెడ్డి సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.