సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవ్యక్తి గుత్తా

share on facebook

– ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేనింకా పుట్టలేదు
– శాసన మండలిలో మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) : రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి గుత్తా సుఖేందర్‌ రెడ్డి అని ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేనింకా పుట్టనేలేదని, అలాంటి వ్యక్తి చైర్మన్‌గా నియామకం కావటం ఉపయోగకరంగా ఉంటుందని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం  శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మండలి ఛైర్మన్‌గా గుత్తా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి అన్ని వ్యవస్థల్లో ఉన్న సుధీర్ఘ అనుభవం రాష్టాన్రికి ఉపయోగపడుతుంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు నాతో పాటు ఇక్కడున్న కొంతమంది సభ్యులు ఇంకా పుట్టనేలేదన్నారు. మా వయసు కన్నా ఎక్కువ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి గుత్తా సుఖేందర్‌రెడ్డి. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన వ్యక్తి గుత్తా అని వివరించారు. వార్డు మెంబర్‌
స్థాయి నుంచి జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యుడిగా, ఎంపీగా వివిధ ¬దాల్లో గుత్తా పనిచేశారు. సహకార వ్యవస్థ, డెయిరీ రంగంలో విశేష సేవలందించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్యపై పోరాడిన నాయకులు గుత్తా అని అన్నారు. సీఎం కేసీఆర్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా ఆకాంక్షించిన ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చిన రోజునే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం యాదృశ్చికంమని, ఏ పార్టీలో ఉన్నా అజాతశత్రువుగా అందరితో సఖ్యతతో ఉన్నారన్నారు. పార్టీలకతీతంగా కలిసిమెలసి నడిచిన సందర్భాలెన్నో ఉన్నాయని, సభ హుందాగా జరిగేలా ఛైర్మన్‌ ¬దాలో గుత్తా సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరు రైతు బిడ్డలు ఉండటం రాష్ట్ర రైతులు సంతోషించాల్సిన విషయమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన చర్చకు పెద్దపీఠ వేస్తారని ఆశిస్తున్నాని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Other News

Comments are closed.