సేంద్రీయ ఎరువులతో సేద్యం చేయాలి

share on facebook

సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచన
సంగారెడ్డి,జనవరి5(జ‌నంసాక్షి): రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మట్టిలో పోషకాలను పెంచేందుకు కృషిచేయాలని జిల్లా వ్యవసాయా అధికారులు  పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వినియోగం పెరిగి భూమికి తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. అన్నదాతలు ఈ విషయాన్ని గుర్తించి రసాయన ఎరువులకు బదులు సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేయాలన్నారు. రైతన్నలు మట్టిని కాపాడితే సమాజాన్ని కాపాడినవారు అవుతారన్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడకం వల్ల భూసారం కోల్పోయి పంట నాణ్యత హీనంగా వస్తుందన్నారు. తద్వారా ఆ పంటను స్వీకరించిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు,. వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు చేయించుకుని రైతులు తమ పోలాల్లొ ఏ పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చన్నారు. అవసరమైనంత మేరకు నత్రజని
పోటాష్‌లు, వినియోగించాలన్నారు అంతేకాకుండా భూమి యొక్క బౌతిక రసాయన స్థితిని బట్టి ఆభూమిలో ఏఏ పంటలు పండుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకునే వీలుకలుగుతుందన్నారు. అధిక మొత్తంలొ రసాయనాలు వాడి భూమిలోని పోషకాలు తగ్గించకుండా భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం రైతులపై ఉందన్నారు. భూసారం తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే తెలుసుకుని వాటిని అవలంబించాలన్నారు.  భూమి ఆరోగ్యంగా ఉంటేనే నాణ్యమైన పంటు పండే అవకాశం ఉందన్నారు. పంటకు కావాల్సిన పోషకాలను భూమి ఇస్తుందని భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు  తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్మికంపోస్ట్‌ సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు. ఇదిలావుంటే మండల స్థాయిలో, గ్రావిూణ స్థాయిలో కూడా ప్రైవేట్‌ వ్యక్తులు మట్టి తవ్వేందుకు ప్రయత్నాలు  చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను  అధికారులను పాటించాలన్నారు.

Other News

Comments are closed.