సొంత నిధులతో యూనిఫామ్స్ పంపిణీ

share on facebook

ఘట్కేసర్ ఆగస్టు 12(జనం సాక్షి) ఘట్కేసర్ మండల్ పరిధిలోని ఎదులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున సుమారు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్స్) స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గట్టగళ్ల రవి గారు తన సొంత ఖర్చులతో అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ను వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు రాజకీయాలతో పాటు సేవాగుణం, ధాతృత్వగుణం కలిగి ఉండాలని, ప్రభుత్వాలు సాయం చేయటం ఆలస్యమైనా పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి దయాగుణంతో, సొంత నిధులతో పిల్లలకు దుస్తులను అందజేయడం అభినందనీయమని, అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ,ఇలాగే ప్రతి ప్రజా ప్రతినిధి వివిధ సమస్యలపై స్పందించి వారికి చేతనైనంత సాయం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ కాలేరు సురేష్,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘనపూర్ గ్రామ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, ఎదులాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ బట్టె శంకర్,,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెట్టు రమేష్ , బింగి రాజేందర్ గౌడ్, వేముల పరమేష్ గౌడ్,వేముల రాజు గౌడ్, తాటికొండ మల్లేష్ గౌడ్ , శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.