సోయా కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ చెల్లింపులు

share on facebook

ఆదిలాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): సోయా కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హాకా కేంద్రాల్లో సిబ్బంది రైతులకు ఇబ్బందులు కలుగుకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దళారులు పంటను ఈ కేంద్రాల్లో విక్రయించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గ్రామాల నుంచి పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చే రైతులు సంబంధిత గ్రామ రెవె న్యూ అధికారులతో ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉండడంతో దళారీలకు ప్రమేయలం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోయా రైతుకు క్వింటాకు రూ.200 బోన స్‌ ప్రకటించడంతో ప్రస్తుతం క్వింటాకు రూ.3050 రైతుకు దక్కుతుంది. ప్రతి సంవత్సరం జిల్లాలో ప్రైవే టు వ్యాపారులు సోయాను కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం రైతులకు ప్రభుత్వం ధర పెంచడంతో సర్కారు ప్రకటించిన ధరకు పంటను కొనుగోలు చేయడానికి నిరాకరించారు. రైతులు నష్టపోకుం డా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. వర్షాలు అనకూలించడం, తెగుళ్లు రాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవడంతో పంట దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సోయా కనీస మద్దతు ధరను పెంచింది. గత ఏడాది క్వింటా ధర రూ రూ.2775 ఉండగా.. రూ.275 పెంచి రూ.2850గా ప్రకటించింది.ఆదిలాబాద్‌, జైనథ్‌, బోథ్‌, ఇచ్చోడ మార్కెట్‌యార్డుల్లో హాకా కేంద్రాలను ప్రారంభించి పంటను కొనుగోలు చేస్తున్నారు. రైతులు నష్టపోకుండా అధికారులు ముందుస్తు ప్రణాళికలతో జిల్లా వ్యాప్తంగా హాకా కేంద్రాలను ప్రారంభించడంతో సోయా రైతుకు కనీస మద్దతు ధర లభిస్తోంది. మార్కెట్‌యార్డుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండడంతో రైతులు పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మకుండా మార్కెట్‌కు తీసుకొస్తున్నారు.

Other News

Comments are closed.