సౌర విద్యుత్‌ రంగంలోకి సింగరేణి

share on facebook

తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇప్పటి వరకు సింగరేణి గతంలో ఎన్నడూ లేనంతగా పురగతి సాధించింది. అటు ఉత్పత్తిలోనూ, ఇలు లాభాలు గడించడంలోనూ గణనీయమైన ప్రగతి సాధించింది. దీంతో సింగరేణి ఉద్యోగులకు కూడా అనేక అవకాశాలు పెరిగాయి. లాభాల్లో వాటా దక్కింది. ఈ సంస్థ మనది అన్న భవాన ఏర్పడింది. అందుకే వారు నిరంతర శ్రమతో పనిచేస్తూ సంస్థను మరింత ముందుకు తీసుకుని పోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. సిఎం శ్రీధర్‌ ప్రత్యేక శ్రద్దతో వివిధ ప్రాంతాల అధికారుల తమ శక్తి మేరకు సంస్థను ముందుకు తీసుకుని వెళుతున్నారు. ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ 700మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యాంత్రీకరణ పెరిగిపోయింది. తద్వారా విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగానే పెరిగింది. ప్రతి యేటా సింగరేణి సంస్థ విద్యుత్‌ చార్జీల రూపేణా రూ.350 నుంచి రూ.400 కోట్ల వరకు ఎన్‌పీడీసీఎల్‌ సంస్థకు సింగరేణి చెల్లిస్తుంది. ఈ దశలో ఇప్పుడు సౌర విద్యుత్‌ ఉత్పత్తిపైనా సింగరేణి దృష్టి సారిందించిది. సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుతో విద్యుత రంగంలో పుపురోగమించాలని చూస్తోంది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో కేవలం 71 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి ఉంటే, నేడు 3,600 మెగావాట్లకు పెరిగింది. దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ రా ష్ట్రం నిలిచింది. మరోవై పు నాణ్యమై న 24గంటల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీంతోసింగరేణి ద్వారా సౌర వెలుగులు విరజిమ్మ నున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం, చేయూతతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏ యేటి కాయేడు లక్ష్యాలను అధిగమిస్తూ, లాభాలను అర్జి స్తూ గణనీయమైన వృద్ధి రేటుతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే థర్మల్‌ విద్యుత్‌ రంగంలో విజయ పరంపర కొనసాగిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనరలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి సింగరేణి అడుగిడింది. దశల వారీగా ఆయా ఏరియాలలో 300మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పక్కా ప్రణాళికలు రూ పొందించి వాటిని శరవేగంగా ఆచరణలో పెడుతోంది. ఇదే కాకుండా, వ్యవసాయ రంగానికి రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం చారిత్రాత్మకంగా నిలిచింది. ఇదంతా ఎంతో ముందు చూపు, పరిపాలన దక్షత కలిగిన సీఎం కేసీఆర్‌ వల్లనే సాధ్యమైంది. తెలంగాణలో ప్రజలు, రైతులు గొప్పగా చెప్పుకుంటున్నారు. నాడు లో ఓల్టేజితో విద్యుత్‌ మోటర్లు కాలిపోయేవి. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పంటలకు సకాలంలో సాగునీరు అందక ఎండిపోయేవి. కరంటు హెచ్చుతగ్గులతో ఇళ్లలో ఫ్యాన్లు, టీవీలు తరచూ కాలిపోయేవి. విద్యుత్‌పై ఆధారపడి జీవనం గడిపే చిన్న తరహా పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగుల జీవనోపాధిపై కూడా ప్రభావం పడేది. ఇలా చేదు అనుభవాలను చవిచూశారు. ఈ క్రమంలో విద్యుత్‌ పరిస్థితిని రాష్ట్రంలో పోల్చుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై విద్యుత్‌ రంగం విషయమై అన్ని వర్గాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తితో కాలుష్యం ఎక్కువగా వెలువడి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. థర్మల్‌ విద్యుత్‌ కంటే సౌర విద్యుత్‌తో పర్యావరణం పరిరక్షించబడటమే కాకుండా వ్యయం కూడా ఆదా అవుతుంది. సింగరేణిలోని వివిధ ఏరియాల్లో రెండో దశలో నిర్మించబోయే 90మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్లకు సంబంధించి టెండర్‌ పక్రియ పూర్తయింది.  టెండర్‌ దక్కించుకున్న ఆదాని నిర్మాణ సంస్థకు సింగరేణి ఆర్డర్స్‌ ఇవ్వనుంది. ఆర్డర్స్‌ అందుకున్న వెంటనే ప్లాంట్ల నిర్మాణ పనులను నిర్మాణ సంస్థ చేపట్టనుంది. రెండో దశలో చేపట్టే 90మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ఎ/-లాంట్లను రూ.360కోట్ల వ్యయంతో నిర్మించబోతుంది. ఈ రెండో దశ పనులను 2020సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశలో మందమర్రి ఏరియాలో స్టేజ్‌-1లో 140 ఎకరాల్లో 28 మెగావాట్లు, ఇదే ఏరియాలో స్టేజ్‌-2లో 75 ఎకరాల్లో 15 మెగావాట్లు, భూపాలపల్లి ఏరియాలో 50 ఎకరాల్లో 10 మెగావాట్లు, కొత్తగూడెం ఏరియాలో 185 ఎకరాల్లో 37 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ఎ/-లాంట్లను నిర్మించనుంది. సింగరేణి సంస్థ చేపట్టబోయే మూడో దశ 81 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణ పనులకు అనువైన భూమిని అన్వేషిస్తుంది. ప్రధానంగా బొగ్గు నిల్వలు లేకుండా ఉండి భవిష్యత్‌లో గనుల తవ్వకం చేపట్టకుండా ఉండే, సాధ్యమైనంత మేరకు నిరూపయోగమైన భూమిని విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి సింగరేణి సంస్థ వినియోగిస్తుంది. మూడో దశ సౌర విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికిఅనువైన భూమి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. భూమిని గుర్తించిన వెంటనే 81మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్లకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులను సింగరేణి సంస్థ చేపట్టనుంది. సింగరేణిలో వివిధ నిర్మాణ సంస్థలు టెండర్‌ పొంది నిర్మించే సౌర విద్యుత్‌ ప్లాంట్లకు అవసరమైన భూమి సింగరేణి సంస్థే సమకూర్చింది. ఆ భూమి చదును, నిర్మితమయ్యే ప్లాంట్ల చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా సింగరేణి చేస్తుంది. మొత్తంగా సింగరేణి ఇప్పుడు అద్భుతమైన పనితనంతో ముందుకు సాగుతోంది. విద్యుత రంగంలో ఇప్పటికేఅనేక విజయాలు సొంతం చేసుకున్న ఈ సంస్థ ఇక సౌరవిద్యుత్‌లో కూడామంచి విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు మెరుగయ్యాయి.

Other News

Comments are closed.