స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న సర్కారు

share on facebook

– 39 జివో వేంటనే రద్దు చేయాలి

– జారీల భూములను స్వాధినం కోసమే భూ ప్రక్షాళన

– తెలంగాణ రాష్ట్ర జేఎసీ చైర్మన్‌ కోదండరాం

– మొయినాబాద్‌లో టీజాక్‌ సత్యగ్రహ దీక్షలో పాల్గోన్న కోదండారం

– జివోను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న తహసీల్దార్‌ కు వినతి పత్రం అందజేత..

మొయినాబాద్‌,అక్టోబర్‌ 3,(జనంసాక్షి):వ్యవసాయం పై అవగహన లేని వారిని రైతు సమన్వయ సమితిల్లో సభ్యులుగా చేర్చుకుంటున్నారి వీటితో రైతులకు ఎలాంటి లభం చేకురాదని తెలంగాణ రాష్ట్ర రాజకీయా జేఎసీ ప్రోఫెసర్‌ కోదండారం పేర్కోన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో జిల్లా టీ జాక్‌, అల్‌ పార్టీల (అఖిల పక్షం) అధ్వర్యంలో రైతు సమన్వయ సమితిలకు సంబందించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన జివో నంబర్‌ 39ను వేంటనే రద్దు చేయాలని గ్రామ పంచాయతీలను బాలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తున్న మంగళవారం మండల తహసీల్దార్‌ కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎసీ చైర్మన్‌ కోదండారం పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులను సమితిల్లో సభ్యులుగా చేర్చకుండా రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎలాంటి మేలు చేకురుతుందని ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ సమితులని వీటిపై గ్రామాలల్లో అవగహన కల్పించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యొక్క రాజకీయ మోసలను వారికి క్లుప్తంగా తెలపాలని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ స్థాయిల టీఆర్‌ఎస్‌ కు పట్టు లేక పోవడంతోనే వీటిని తీసుకువచ్చారని పేర్కోన్నారు. అంతకు ముందుక గ్రామ జ్యోతి కమిటీలు ఎక్కడికి పోయాయని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి సమితిలకు పూర్తి అధికారలు ఇస్తున్నాట్లు పేర్కోనడం ఎంత వరకు సబాబు అని అన్నారు. న్యాయంగా సంఘాలు వేస్తే ఎటువంటి అభ్యంతరం లేదని అన్యాయంగా టీఆర్‌ఎస్‌ నాయకులకు మాత్రమే సమితిలల్లో సభ్యులుగా చేర్చుకోవడం ఎంత వరకు న్యాయం అన్నారు. భారత దేశ రాజ్యంగం ఏర్పాటు చేసిన పంచాయతీ వ్యవస్థను ముఖ్య మంత్రి సమితిల పేరుతో వాటికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం నాటి కాలంలో ఉన్న జాగీరుల భూములను గుర్తించి వాటిని స్వాధినం చేసుకునేందుకే రాష్ట్ర వ్యాప్తంగా భు రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతున్నారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎద్దెవ చేశారు. అప్పటి పట్వారి వ్యవస్థను మళ్లి రైతు సమన్వయ సమితిలతో తీసుకువస్తున్నాడని అన్నారు. గత ఎండకాలంలో నీటి ఎద్దడి కారణంగా గ్రామాల్లో సర్పంచ్‌ సొంత డబ్బులతో నీటి ట్యాంకుల ద్వారా నీటిని సరఫర చేస్తే ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయాలేదని తెలిపారు. ముందు గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన తరువాత అప్పుడు వీటిపై అలోచించాండి అంటు పేర్కోన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కేవలం అవకాశవాద రాజకీయ చేస్తున్నారని అన్నారు తెలంగాణ ఉద్యమం తరువాత జివోను రద్దు చేయాలని ఉద్యమం చేయడం తెలంగాణ లో రాజకీయ పార్టీలు ప్రభుత్వాని పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయడం ఆనందంగా ఉందని పేర్కోన్నారు.

గ్రామ జ్యోతి కమిటీలు ఏవీ..?

తెలంగాణ ప్రభుత్వం అర్బటంగా నిర్వహిస్తున్న రైతు సమితులను అంతకు ముందు గ్రామ జ్యోతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిరన కమిటీలు ఎక్కడి వెళ్లాయి అని కోదండారం ప్రశ్నించారు. వాటిని సరిగ్గా అధికారలు ఇవ్వకుండా సమితిల పేరుతో రైతులను అటు ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని అన్నారు. రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేయడం అంత అవసరం ప్రస్తుతం ఎముందని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి చేందితే ఎవారు ఇబ్బంది పడారని కానీ అక్రమంగా కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలనే సమితిలు సభ్యులుగా చేర్చుకోవడం, గ్రామ పంచాయతీ వ్యవస్థ, స్థానిక సంస్థలను నిర్విర్యయం చేయడం కోసమే ఈ కమీటిలని మళ్లి పాటెల్‌ పట్వారి వ్యవస్థను తీసుకురవడం కోసమే ఈ సమితిలు అని అన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ పట్టుకోసమే ఈ రాకంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ యువజన నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డి, జేఎసీ వైస్‌ చైర్మన్‌ పురుషోత్తం, సోషల్‌ మీడియా రాష్ట్ర చైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి, టీజాక్‌ జిల్లా అధ్యక్షుడు చెర్మా రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ చైర్మన్‌ ముకుందరావు, చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్చ్‌ పాడల వెంకట స్వామి, కీసాన్‌ సంఘ్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పూరణం విరభద్ర స్వామి, మొయినాబాద్‌ మండలం ఆయా పార్టీ అధ్యక్షులు కుమ్మరి రమేష్‌, కొత్త నర్సింహ రెడ్డి, మందడి వెంకట్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మిడి వెంకట్‌ రెడ్డి, టీ జాక్‌ నాయకులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

 

Other News

Comments are closed.