స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం  

share on facebook

కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు
మహబూబాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసిజిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోని టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని ఎమ్మెల్యే శంకర్‌ నాయకు పిలుపు నిచ్చారు. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సిఎం కెసిఆర్‌ పేరు నిలపాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథాకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్‌ చేపట్టిన పథకాలను చూసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిపిస్తారని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకపోయి అన్ని స్థానాలను మనమే గెల్చుకునే విధంగా పనిచేయాలని అన్నారు. పథకాలను వివరిస్తూనే ప్రజలకు మనంగా కలసి ఓట్లు అభ్యర్థించాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, అలాగే నాయకుల మధ్య ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి ఎన్నికల్లో వారి సత్తా చాటుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకులందరికీ కూడా స మాన అవకాశాలు కల్పిస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సమష్టిగా పనిచేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీలో సత్తా కలిగిన వారిని, పనిచేసే వారిని గుర్తించి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో పాటుగా పాత, కొత్త నాయకులు, కార్యకర్తలంతా కూడా కలిసి పనిచేయాలని కోరారు. అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ గెల్చుకుని మన సత్తాను నిరూపించుకోవాలని ఆమె అన్నారు.

Other News

Comments are closed.