స్పీకర్‌ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం

share on facebook

 స్పీకర్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ
భూపాలపల్లి, జూన్‌9(జనం సాక్షి ) : తెలంగాణ సభాపతి మధుసూదనాచారి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గం భూపాలపల్లిలోని గణపురం శివారులో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో కాన్వాయ్‌లోని వాహనాలు రోడ్డు కిందకి దూసుకెళ్లాయి. ప్రమాదం నుంచి స్పీకర్‌ మధుసూదనాచారి సురక్షితంగా బయటపడ్డారు. స్పీకర్‌ మధుసూదనచారి శనివారం ఉదయం తన నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలో పల్లె నిద్ర ముగించుకొని భూపాలపల్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు ఆయన స్థానిక ప్రజలతో మమేకమవుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.  రైతులతో కలిసి పొలంలో నాగలి పట్టి దుక్కిదున్నారు. అక్కడ నుంచి భూపాలపల్లి బయలుదేరారు

Other News

Comments are closed.