స్మార్ట్‌ బైక్‌పై గవర్నర్‌ ప్రయాణం

share on facebook

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రయాణికులను చివరి గమ్యస్థానం వరకు చేర్చడమే లక్ష్యంగా మెట్రోరైల్‌ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం సందర్భంగా.. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కేటీఆర్‌ రాజ్‌భవన్‌ వరకు స్మార్ట్‌ బైక్‌లపై వెళ్లారు. అంతకుముందు అవిూర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు గవర్నర్‌, కేటీఆర్‌ మెట్రోలో ప్రయాణించారు. తిరుగు ప్రయాణంలో ఖైరతాబాద్‌ స్టేషన్‌ వద్ద దిగిన గవర్నర్‌, కేటీఆర్‌.. రాజ్‌భవన్‌ వరకు స్మార్ట్‌బైక్‌లపై వెళ్లారు.  మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌
చేయగానే ఒక పాస్‌వర్డ్‌ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయగానే బైక్‌ లాక్‌ ఓపెన్‌ అవుతుంది.
యాప్‌ద్వారా, స్మార్ట్‌కార్డు రెండింటి ద్వారా బైక్‌లను బుక్‌ చేసుకోవచ్చు. తిరిగి యాప్‌, కార్డ్‌ల ద్వారానే వెనక్కి ఇచ్చేయచ్చు. ఎలక్టాన్రిక్‌ డివైజ్‌తో దీనిని ఆపరేట్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. బైక్‌లను దొంగిలించడానికి వీలులేదు. బార్‌కోడింగ్‌, జీపీఎస్‌ల ద్వారా ఎక్కడున్నాయో వీటిని పసిగట్టవచ్చు.  ఛార్జీలను డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో చెల్లించవచ్చు.

Other News

Comments are closed.