స్వయం ఉపాధికి అవకాశాలు

share on facebook

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం స్వశక్తి సంఘాల సభ్యులు ఆర్థిక ఎదుగుదలకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎ శరత్‌ సూచించారు. పథకం అమలును గ్రావిూణ, పట్టణ ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలనీ, మండల సమాఖ్య, డీఆర్డీఏ, మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఈ పథకానికి 8వ తరగతి ఉత్తీర్ణత సాధించిన యువతీ, యువకులు అ ర్హులని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై  ఇటీవల అవగాహ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ  అభ్యర్థులు 18ఏళ్ల వయస్సు కలిగి ఉండాలనీ, ఈ పథకం ద్వారా రూ.లక్ష నుంచి రూ.25లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందనీ, వీటితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే రూ.1కోటి వరకు రుణాలు సబ్సిడీపై ఇస్తారని తెలిపారు. మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకు, మాజీ సైనికులు, గ్రావిూణులకు 35శాతం, పట్టణ ప్రాంతాల వారికి 25 శా తం చొప్పున సబ్సిడీ ఉంటుందని తెలిపారు. టెంట్‌హౌజ్‌, సెంట్రింగ్‌, సబ్బు లు, పర్సులు, పెనాయిల్‌, ¬టల్‌, వాటర్‌ ఎ/-లాంట్‌, ఎంబ్రాయిడరీ, కులవృత్తు లు తయారు చేసే వారికి వీ టిపై కరీంనగర్‌లో కూడా శిక్షణనివ్వాలనీ, రైస్‌మిల్లు లు, తిను బండారాలు, క్షౌరశాలలు, లాండ్రీషాపు, బ్యాటరీ చార్జింగ్‌, సైకిల్‌షా ప్‌, బ్యాండ్‌ మేళాలు, టీ స్టాళ్లు లాంటి చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేవారు దరఖాస్తులను అన్‌లైన్‌ ద్వారా పంపాలనీ అన్నారు.  సందేహాలుంటే మండల పరిధిలో సెర్ఫ్‌ ఏపీఎం, పట్టణ పరిధిలో మున్సిపల్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఏపీడీలు మహిళా సం ఘాలు, గ్రామ పంచాయతీల్లోని, ము న్సిపాలిటీల్లోని యువతీ, యువకులకు ఉపాధి పొందేందుకు, వారిని ప్రోత్సహించి వారితో పాటు వారి వద్ద పనిచేసే వారికి ఉపాధి కల్పించిన వారిమవుతామన్నారు.

Other News

Comments are closed.