స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్‌ మైదానం ముస్తాబు

share on facebook

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబయ్యింది. ఇక్కడే జెండా ఆవిష్కరణ జరుగనుంది. ఇక్కడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 9 గంటలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి పతాక ఆవిష్కరణ, వందన స్వీకారం చేస్తారన్నారు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టారని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. పంద్రాగస్టు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ అలంకరించారు. ప్రభుత్వ శాఖలన్నీ సంయుక్తంగా జెండా పండగకు పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. ఆయా శాఖల పురోగతి ప్రదర్శిస్తూ శకటాలు, స్టాల్స్‌ ఏర్పాటుతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆహ్వానితులంతా ఉదయం 8.40 గంటలకు మైదానానికి హాజరుకావాలని చెప్పారు. వివిధ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన. 10గంటలకు విద్యార్థిల సాంస్కృతిక ప్రదర్శనలు. 11 గంటలకు బహుమతి ప్రదానం, యోగ్యతా ప్రశంస పత్రాల పంపిణీ, 11.30 గంటలకు కార్యక్రమం ముగింపు ఉంటుందని డీఆర్వో పేర్కొన్నారు.

Other News

Comments are closed.