స్వాతి కోసం ఏమైనా చేస్తా : ప్రియుడు రాజేష్‌

share on facebook

హైదరాబాద్ : స్వాతి అంటే నాకు పిచ్చి ప్రేమ? ఆమె కోసం నేను ఏమైనా చేస్తా? ముఖాన్ని కూడా కాల్చుకుని భరించలేని నొప్పిని సైతం ఆనందంగా అనుభవించా? అందుకే ఆమెకు ఇష్టం లేని భర్త అడ్డు తొలగించడంలో సహాయం చేశా?.. ఇవి స్వాతి కేసులో… ఆమె ప్రియుడు రాజేష్‌ వాంగ్మూలం. ఇవాళ రాజేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుధాకర్‌ రెడ్డి హత్య కేసులో నాగర్‌కర్నూలు పోలీసులు స్పీడ్‌ పెంచారు. స్వాతి ప్రియుడు రాజేష్‌ను హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో అరెస్ట్ చేసి నాగర్‌కర్నూల్‌ తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అనంతరం తమ కస్టడీలోకి తీసుకుని రాజేష్‌ను సుదీర్ఘంగా విచారించారు. పోలీసులు స్వాతితో పరిచయం దగ్గరినుంచి, వారిద్దరి మధ్య బంధం, సుధాకర్‌ను హత్య చేసిన తీరు గురించిన వివరాలపై ఆరా తీశారు.

సుధాకర్‌ రెడ్డి మెడపై అనస్థిషియా ఇంజక్షన్‌ గుచ్చి తలపై ఇనుపరాడ్డుతో దాడి చేసి హతమార్చినట్లు రాజేష్‌ చెప్పాడు. మృతదేహాన్ని కారులో ఫతేపూర్‌ అటవీప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేసినట్లు చెప్పాడు. ఆ తరువాత ముఖంపై పెట్రోలు పోసుకుని గ్యాస్ స్టౌపై తలపెట్టినట్లు రాజేష్ వివరించాడు. నాగర్‌కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు నరేష్‌ మత్తు ఇంజక్షన్‌ సరఫరా చేసినట్లు తెలిపాడు. రాజేష్‌ ఇచ్చిన వివరాలతో నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Other News

Comments are closed.