హరితహారంలో జిల్లా ముందంజ

share on facebook

నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమాన్ని పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు విజయవంతం చేశారు. దీంతో జిల్లాకు ప్రత్యేక ప్రశంస దక్కనుంది. ఇందులో కలెక్టర్‌ కృషి విశేషంగా ఉందని ఇటీవల ఎంపి కవిత కూడా అన్నారు. మొక్కలతో పాటు నాటిన మొక్కల సంరక్షణపై చైతన్యం చేస్తూ ప్రజలు మేల్కొనేలా చేస్తున్నారని కలెక్టర్‌ పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రపంచంలోనే మూడో అతి పెద్దదని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆ స్థాయిలో కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రం వరకు మొక్కలు నాటేలా కలెక్టర్‌ ప్రణాళికలు చేసి విజయవంతం చేశారు. ఇందుకు అన్నివిధాల సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు నడిపించారు.

 

Other News

Comments are closed.