హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండాలి

share on facebook

శిక్షణా కార్యక్రమం ప్రారంభించిన మంత్రి మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,జూలై 2(జ‌నం సాక్షి ): హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి మొక్కల పెపంపకంలో ప్రతి ఒకర్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో హరితహారం మొక్కల పెంపకం, నిర్వహణపై శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఓమర్‌ జలీల్‌, ఎస్పీ అన్నపూర్ణ, ఎమ్మెల్యే సంజీవరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో గతేడాది నాటిన మొక్కల వివరాలు, బతికిన మొక్కల వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. హరితహారం రాష్ట్రానికి మణిహారం కావాలన్నారు. జిల్లాలో ప్రణాళికబద్దంగా కోటి 40 లక్షల మొక్కలను 374 గ్రామాల్లో నాటాలన్న మంత్రి.. హరితహారం ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో రక్షణ కమిటీల ద్వారా మొక్కల పెంపకం విూద అవగాహన కల్పించాలని సూచించారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

Other News

Comments are closed.