హరితహారం కింద 40వేల మొక్కలు

share on facebook

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి): రాష్టాన్న్రి హరితతెలంగాణ మార్చడానికి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ సత్తయ్య కోరారు. జిల్లాలో విస్తృతంగా హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 35 లక్షల గుంతలను తవ్వించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 17 లక్షల గుంతలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కనీం రెండు మొక్కలు నాటాలని అన్నారు. అలాగే వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇది ప్రజల కార్యక్రమమని అన్నారు. మొక్కలు నాటడంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. చెట్లు కన్న తల్లివంటిదని, వాటిని సంరక్షించాల్సిన

బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అడవులు అంతరించిపోవడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని, దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అన్నారు. సమయాని వర్షాలు కూడా కురువడం లేదని తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తులో ఈ సమస్యలను అధిగమించవచ్చునని అన్నారు. హరితహారం మొక్కల విషయంలో నిరక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో పాటు ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు అవగాహన కల్పించాలని సూచించారు. మరుగదొడ్లు వాడడంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

—-

 

Other News

Comments are closed.