హరితహారం కోసం అటవీశాఖ సన్నద్దం

share on facebook

రెండు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

నల్లగొండ,,లై5(జ‌నం సాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెలలోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న దృష్ట్యా అటవీ శాఖ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సూచించిన తేదీల నుంచి చేపడతామని జిల్లా అటవీశాఖ అధికారి శాంతారామ్‌ తెలిపారు. 2016 నుంచి ప్రతిఏటా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటిస్తున్నారు. జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉండటంతో మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల మొక్కలను నాటుతున్నారు. ఈసారి కూడా 2 కోట్ల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 31 మండలాల్లో 2 కోట్ల మొక్కలను నాటించడంతో పాటు వాటిని సంరక్షించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆదేశాల మేరకు 38 శాఖలను హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంతో పాటు ఆయా శాఖలకు లక్ష్యాలను సైతం నిర్దేశిరచారు.ఆయా నర్సరీల్లో ఇప్పటి వరకు 1.68 కోట్ల మొక్కలు అందుబాటులో ఉండగా మరో 32 లక్షల మొక్కలను ఇతరజిల్లాలు లేదంటే ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఆయా శాఖల ఆధ్వర్యంలో 75 లక్షల టేకు మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతం 62 లక్షల మొక్కలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది 2 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కల పెంపునకు చర్యలు తీసుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించక పోవడంతో 1.68 కోట్లే పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా గతేడాది 2.22 లక్షల మొక్కలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటగా అందులో 53 శాతం సంరక్షించబడినట్లు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలతో పాటు రోడ్ల వెంట నాటిన మొక్కలు ఎక్కువగా సంరక్షించబడ్డాయి. ఈ సారి అంతకు మించి సంరక్షించాలనే లక్ష్యంతో 38 శాఖల భాగస్వామ్యంతో మొక్కలు నాటాలని నిర్ణయించారు. గ్రావిూణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా 79 లక్షల మొక్కలను నాటడంతో పాటు సంరక్షించే బాధ్యత అప్పగించారు.

Other News

Comments are closed.