హరితహారం కోసం ప్రణాళిక

share on facebook

జనగామ,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం సవిూపించినందున హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని పంచాయితీ అధికారి పిలుపునిచ్చారు. ఈ యేడు కూడా జిల్లాలో పెద్దెత్తున మొక్కలు నాటేందుకు ప్లాన్‌ వేశామని అన్నారు. ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా మొక్కలను విస్తృతంగా పెంచాలన్నారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథకు సంబంధించి ప్రధాన పైప్‌లైన్‌ పనులు పూర్తవగా అంతర్గత పైప్‌లైన్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. కాగా అంతర్గత పైపు లైన్లపై సర్పంచ్‌లకు పూర్తి అవగాహన ఉంటుందని వీటిని పూర్తి చేసే బాధ్యతను సర్పంచ్‌లు తీసుకోవాలని కలెక్టర్‌ భావిస్తున్నారని, దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ పనులు పూర్తి చేయించాలన్నారు. దీనికి బిల్లులు సంబంధిత కాంట్రాక్టర్‌ నుంచి కలెక్టర్‌ ఇప్పిస్తారని ఆయన అన్నారు. మరో వైపు ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేలా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, క్షేత్రసహాయకుడు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పాటుపడాలన్నారు. ఇదిలావుంటే జనగామ నియోజకవర్గానికి గోదావరి నీరు అందిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.ప్రతీ గ్రామంలోని చెరువును నీటితో నింపుతామని అన్నారు. పోయినసారి ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో చూసి వాటిని సరిచేయనున్నట్లు తెలిపారు.

 

Other News

Comments are closed.