హరితహారం బాధ్యత అందరిది

share on facebook

బాధ్యతగా మొక్కలు నాటాలి: జలగం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): హరితహారంను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోరారు. కొత్తగూడెం సెంట్రల్‌ పార్కులో బుధవారం ఆర్యవైశ్యులు చేపట్టిన హరితహారంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. 250 ఎకరాలలో పార్కును నందనవనంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే రాబోవు కాలంలో హెర్బల్‌ పార్కుగా మార్చనున్నట్లు తెలిపారు. పార్కు అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. పార్కులో మూడు ఎకరాల అభివృద్ధికి ఆర్యవైశ్యులకు అప్పగించామని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారాన్ని వెల్లువలా చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆర్యవైశ్యుల సహకారం అవసరం అన్నారు. క్రాస్‌ రోడ్డు వద్ద టూరిజం ¬టల్‌ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. పాల్వంచ మండలం కిన్నెరసాని పర్యాటకప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు కేస్లీ, డీఆర్‌డీవో జగత్‌ కుమార్‌ రెడ్డి, కౌన్సిలర్‌ సత్యభామ, మాజీ సర్పంచ్‌ వశ్య నాయక్‌, ఆర్యవైశ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.