హరితహారం మొక్కలు కాపాడాలి

share on facebook

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌10(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని
ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పలుచోట్ల నాటిన మొక్కలు మొలకెత్తక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బస్తీ పథ కం కోసం భూమి లేని ఎస్సీ రైతులను గుర్తించి, వారికి ప్రభుత్వం తరుపున మూడెకరాల భూముల్ని ఇస్తామని చెప్పారు.  అర్హులకు ఒక్కొక్కరికీ మూడెకరాల చొప్పున భూముల్ని త్వరలోనే అందజేస్తామన్నారు. ప్రభుత్వం అందజేసిన ఈ భూముల్ని రైతులు ఇతరులకు విక్రయించినట్లు ఫిర్యాదు అందితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, ఆ భూముల్ని వెనక్కి తీసుకుని ఇతర రైతులకు అప్పగిస్తామని చెప్పారు.  నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హావిూ పనులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జోగురామన్న అన్నారు.  గ్రామాల్లో ఉపాధి హావిూ పనులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.  భారీ నిర్మాణ పనులను పరిశీలించి వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో చాలా మంది ఉపాధి హావిూ పనుల్లో ఎలాంటి పనులు ఉన్నాయో తెలియక పనులు చేసే అవకాశం కోల్పోతున్నారని అన్నారు. ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇకపై పనులు చేయబోయే ముందు రోజు సంబంధిత గ్రామాల్లో తప్పని సరిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. కూలీలకు ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చేలా చూడాలని ఆదేశించారు.  గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని మంత్రి అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, వంటశాలతోపాటు పాఠశాల పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవద్దన్నారు.

Other News

Comments are closed.