హరిత తెలంగాణ లక్ష్యం కావాలి

share on facebook

సిద్దిపేట,జూలై12(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ ప్రతిష్ఠాత్యకంగా చేపట్టిన హరితహారంలో అందరం భాగస్వాములం అవుదామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని అన్నారు. హరితతెలంగాణెళి ధ్యేయంగా కేసీఆర్‌ తలపెట్టినహరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారన్నారు. హరితహారంలో ముఖ్యంగా మహిళలు, యువకులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు చురుకుగా పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలను నాటాలన్నారు. సంరక్షణ బాధ్యత సైతం తీసుకోవాలని కోరారు. అలాగే వ్యవసాయాధికారులు సైతం భాగస్వాములై రైతులతో మాట్లాడి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులు, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీలు, ఆశవర్కర్లు, సాక్షరభారత్‌ వీసీవోలు, రేషన్‌ డీలర్లు, వీఆర్‌ఏలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది తమ పరిధిలోని ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు. హరితహారం వల్ల కలిగే లాభాలు, వారు చేయాల్సిన బాధ్యత తెలిపి

అవగాహన కల్పించి హరితహారంలో భాగస్వాములను చేయాలన్నారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు సైతం అధికారులు, ప్రజలు, మహిళలతో కలిసి మొక్కలను సంరక్షించాలన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా, వర్షాలు కురిసే సమయంలోనే పరిమితంగా మొక్కలను నాటి వాటికి నీరుపోసి సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఉపాధి హావిూ కూలీలను భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు.

 

Other News

Comments are closed.