హావిూల అమలులో ముందున్నాం: మంత్రి

share on facebook

అనంతపురం,జనవరి7(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నారని, సీమ అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జన్మభూమి-మఊరు కార్యక్రమంలో బాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. సిమెంటు రోడ్లు, దోబిఘాట్లు, ప్రతి ఇంటికి వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, మైనార్టీ కమ్యూనిటీ హాల్‌, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, తాగునీటి పథకం వంటి అనేక కార్యక్రమాలు గ్రామాల్లో చేపడుతున్నామని అన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, బిసి, ఎస్సీ శ్మశానవాటికల అభివృద్ధి తదితర హావిూలను ముఖ్యమంత్రి అతితక్కువ కాలంలో అమలు చేశారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హావిూ ఇచ్చిన మేరకు కొత్త రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు వివరించారు. సుస్థిర అభివృద్ధి సాధించి రాష్ట్ర ప్రజలందరీ మోములో చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం నాలుగో విడత జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. చంద్రన్న సంక్రాంతికానుక, కుట్టమిషన్లు, దీపం గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశారు.

Other News

Comments are closed.