హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు

share on facebook

తెలంగాణ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి. ఎన్నికలు అనివార్యంగా వస్తున్నాయి. కెసిఆర్‌ ముందస్తు ప్రణాళికతో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి కాలం అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ కొనసాగాలన్న రూల్‌ ఏదీ లేకపోడంతో నేతలు అప్పుడప్పుడు తమకు అనుకూలంగా ఉన్న సమయాల్లో ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్నది. అయితే ఇలాంటి అవకాశాలు లేకుండా రాజ్యాంగంలో నిర్దుష్ట నిమాలు ఉండాలి. ఎప్పిఉడు పడితే అప్పుడు రాజకయీ పార్టీలు తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్లకుండా రూల్‌ ఉండాలి. గతంలో 2004లో కూడా కేంద్రంతో పాటు, ఉమ్మడి ఎపిలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ఎప్పుడయినా వంద సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఉన్న కెసిఆర్‌ ఎందుకనో ఆరునెలల ముందే ఎన్నికలు కోరుకుంటున్నారు. కేంద్రంతో కలసి ఎన్నికలకు వెళ్లడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు.

ప్రగతినివేదన సభ తరవాత హుస్నాబాద్‌లో ఆశీర్వాద సభతో అసలుసిసలు ఎన్నికల శంఖారావం పూరించ బోతున్నారు. దీనికి ముందస్తుగా గురువారం తెలంగాణ కేబినేట్‌ భేటీలో రద్దు అశంపై నిర్ణయం తీసుకో నున్నారు. ఇదే జరిగితే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అసెంబ్లీ కాలపరిమితి ఐదేళ్లయినా, దానిని ముందుకు పొడిగించే అవకాశాలు రాజ్యాంగంలో లేవు. అయితే ముందుగా రద్దు చేసుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఆర నెలల్లో ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబందు, రైతుబీమా, ఉచిత కరెంట్‌ వంటి పథకాల అమలుతో ఇప్టపికిప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లు గెల్చుకుంటామన్న ధీమాతో సిఎం కెసిఆర్‌ పావులు కదుపుతున్నారు. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో జిల్లాల ఏర్పాటుతో పాటు, ప్రాజెక్టుల పై మహా ఒప్పందాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా అధికార టిఆర్‌ఎస్‌ ఎదురుదాడితో ముందుకు సాగుతోంది. ఇకపోతే టిడిపి,కాంగ్రెస్‌,బిజెపి సహా వామపక్షాలు కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలపై పోరాడుతున్నా ఎందుకనో ఇవేవీ ప్రజలను కదిలించే స్థాయిలో లేకపోవడంతో టిఆర్‌ఎస్‌ దర్జాగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ సహా టిడిపి విమర్శలకు పసలేకుండా పోయింది. సిఎం కెసిఆర్‌ ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని, ¬మంత్రి రాజ్‌నాథ్‌ను, ఇతర మంత్రులను కలుసుకుని వచ్చాక ఎన్నికలపై ఊహాగానాలు వచ్చాయి. శాసనసభ ముందస్తు రద్దు పక్రియ వేగం అందుకుంది.అంతా అనుకున్నటుగా జరిగితే గురువారం ఉదయమే మంత్రివర్గం సమావేశమై అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయడం ఖాయంగా ఉంది. ఆపద్దర్ఱ్మ ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ఎన్నికలకు వెళ్లాలన్న భావనలో ఉన్నారు. మరోవైపు ఉన్నత స్థాయి ప్రభుత్వ యంత్రాంగం అంతా దీనిపై కసరత్తు చేస్తున్న తీరు కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంగతిని ధృవపరుస్తున్నాయి. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి, సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి నరసింగరావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వివిధ అంశాలపై చర్చించిన అనంతరం గవర్నర్‌తో సమావేశ మయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి వద్దకు సీఎస్‌ జోషి తదితరులు వెళ్లి మంత్రివర్గ సమావేశానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలిసింది. ప్రతి దశలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తున్న కెసిఆర్‌ విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సాగుతున్నారు. అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కూడా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషితో సమావేశమయ్యారు. ఈ నెల ఆరవతేదీన మంత్రివర్గం

సమావేశమై శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం చేసిన వెంటనే గవర్నర్‌ ఆమోదం, కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపడం ఇలా అన్ని పనులు చకచకా జరిగిపోనున్నాయి. గురువారం ఉదయం ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఈ విషయం నిర్ధారణ కాలేదు. ఇకపోతే రద్దుకు ముందే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా వాటిపైనా స్పష్టత రాలేదు. ఉద్యోగులకు మధ్యంతర భృతి తదితర అంశాలపై కూడా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో పెట్టకుండా ఉత్తర్వు ద్వారానే ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రజల ఆశీర్వాద సభ పేరుతో శాసనసభను రద్దు చేసిన మరుసటి రోజే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగే బహిరంగసభలో సీఎం కెసిఆర్‌ పాల్గొంటారు. ఆ రోజు నుంచి సుమారు 100 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. అంటే దాదాపు ప్రతి నియోజకవర్గ సభలోనూ కేసీఆర్‌ మాట్లాడనున్నారు. శాసనసభను రద్దు చేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు ఈ బహిరంగసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. దీనిని బట్టి ఎన్నికల ప్రచారాం మొత్తాన్ని ముఖ్యమంత్రి తన విూద వేసుకొన్నట్లు స్పష్టం అవుతుంది. ఈ నెల రెండున హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించినప్పటికీ, అసెంబ్లీ రద్దు చేసిన మరుసటి రోజే హుస్నాబాద్‌లో ఆశీర్వాదం పేరుతో జరిగే సభకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఇక విపక్ష పార్టీలు కూడా అందుకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దం అని కాంగ్రెస్‌ కూడా ప్రకటించింది. బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు కూడా ఎన్నికలకు బిజెపి సిద్దమని అన్నారు.

Other News

Comments are closed.