హుస్నాబాద్‌ సెంటిమెంట్‌ను గౌరవించండి

share on facebook

ఆదర్శ పాలన అందిస్తున్న కెసిఆర్‌ను దీవించండి

ఎన్నికలు ఎప్పుడయినా వందసీట్లు గెలవడం ఖాయం

హుస్సాబాద్‌లో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాబోయే శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. చివరి ఎన్నికల సభను కూడా హుస్నాబాద్‌ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తేవడమే కాదు.. 90 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. 50 ఏండ్ల తర్వాత తండా వాసుల కలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్‌ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాదు.. చెప్పనివి కూడా అమలు చేశామని హరీశ్‌ రావు తెలిపారు. ఇకపోతే వచ్చే వానాకాలం నాటికి రైతులు మొగులుకు ముఖం పెట్టి చూడాల్సిన అవసరం ఉండదని, నేలకేసి దున్నుడే ఉంటదని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.హుస్నాబాద్‌లో నిర్వహించనున్న ప్రజల ఆశీర్వాద సభకు సంబంధించి మండలస్థాయిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. గత ఎలక్షన్ల సమయంలో కూడా ఎన్నికల సభలు హుస్నాబాద్‌ నుంచే ప్రారంభించామని మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. హుస్నాబాద్‌లో సతీష్‌ కుమార్‌ గెలిచారని, తెలంగాణలో గులాబీ జెండా ఎగిరిందన్నారు. 2009 ఎన్నికల్లో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామన్న కాంగ్రెస్‌, 2014 దాకా అధికారంలో ఉన్నా చేసిన పాపాన పోలేదని హరీశ్‌ విమర్శించారు. ఆదివాసులు, గిరిజనుల 50 ఏండ్ల కలను నిజం చేస్తూ తండాలు, గూడేలను సీఎం కేసీఆర్‌ గ్రామ పంచాయతీలు చేసిన్రని చెప్పారు. తండాలన్ని కదిలొచ్చి సీఎం కేసీఆర్‌ ను ఆశీర్వదించి దిల్‌ ఖుషి చేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన అంశాలే కాకుండా చెప్పని అంశాలు కూడా చేస్తున్నామన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ అంటే.. ఎట్లా ఇస్తరు, ఇస్తే అది విచిత్రమే అని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారని హరీశ్‌ రావు గుర్తుచేశారు. మరిప్పుడు చిత్రమా.. విచిత్రమా అనేది ఆ జానారెడ్డి చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే విూ బతుకు చీకటైతదని అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నడని.. కానీ ఆయన రాజకీయ జీవితమే చీకటైందని, కాంగ్రెస్‌ దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. ఇకపతోఏ గతంలో డబ్బులు కాంగ్రెస్‌ నేతల జేబుల్లోకి పోతే ఇప్పుడు పెన్షన్ల రూపంలో ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. హుస్నాబాద్‌ వేదికగా నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఇక్కడి ప్రజలే తొలి ఆశీర్వచనాన్ని తెరాస ప్రభుత్వానికి అందించనున్నారు. ఉమ్మడికరీంనగర్‌ జిల్లా నుంచి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా విజయవంతం కావడంతో ఆ సెంటిమెంట్‌ను కొనసాగించనున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలున్నాయి. ఒక్కో మండలంపై ప్రత్యేకంగా దృష్టిసారించి శ్రేణులను తరలించేందుకు వీలుగా బాధ్యతలు అప్పగించారు. చిగురుమామిడి మండలానికి కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, సైదాపూర్‌ మండలానికి మంత్రి ఈటల, కోహెడకు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, అక్కన్నపేటకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, భీమరదేవరపల్లికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పర్యాటక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, ఎల్కతుర్తికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, హుస్నాబాద్‌ పట్టణం, గ్రావిూణ ప్రాంతానికి మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి పర్యవేక్షకులుగా పనిచేయనున్నారు.

 

 

Other News

Comments are closed.