హెలికాప్టర్‌ను మోసుకెళ్లిన హెలికాప్టర్‌!

share on facebook

టోక్యో: సాంకేతిక లోపంతో చెడిపోయిన వాహనాలను మరో వాహనాలు తాడుతో కట్టి తీసుకెళ్లే దృశ్యాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ చెడిపోయిన ఓ హెలికాప్టర్‌ను మరో హెలికాప్టర్‌ మోసుకెళ్లడం చూశారా. ఈ ఘటన జపాన్‌లోని ఒఖినావా ప్రాంతంలో చోటుచేసుకుంది.

సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఓ హెలికాప్టర్‌ సముద్రం సమీపంలో ల్యాండైంది. దాన్ని బాగుచేసేందుకు అమెరికా తీర ప్రాంత దళాలు మరో పెద్ద హెలికాప్టర్‌ను రంగంలోకి దించాయి. హెలికాప్టర్‌ కింద స్టాండ్‌కి పాడైపోయిన హెలికాప్టర్‌ను తాడుతో కట్టి తరలించారు. ఈ అరుదైన దృశ్యాన్ని అధికారులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Other News

Comments are closed.