హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

share on facebook

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భాగ్యనగర వాసులకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఉన్నట్టుండి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఉరుములతో కూడా జల్లులు కురిశాయి. కొన్నిచోట్ల వడగళ్లు పడ్డాయి.  దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, రామ్‌నగర్‌, విద్యానగర్‌,హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, చార్మినార్‌, బహుదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు శివారు ప్రాంతాలైన పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు వీయడంతో పాటు వడగళ్లు కూడా పడ్డాయి.

 

Other News

Comments are closed.