హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి..  టీటీడీపీ నేతల యత్నం

share on facebook

– అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది కేంద్రం కుట్ర అంటూ తెతెదేపా శ్రేణులు హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎంఎన్‌ శ్రీనివాస్‌ సహా ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు. కేంద్రం కుట్రలో భాగంగానే చంద్రబాబు వారెంట్‌ జారీ అయిందని, దాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా పలువురిని కొద్దిసేపు పోలీసు స్టేషన్‌లో నిర్భంలో ఉంచారు.

Other News

Comments are closed.