12న కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

share on facebook

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని బాల, బాలికలను అండర్‌20 విభాగంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంద్యాల లింగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో నిర్వహించేఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పదో తరగతి మెమో, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు. బాలురు 70 కిలోల లోపు, బాలికలు 65 కిలోల లోపు బరువు ఉండాలని చెప్పారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు మహబుబాబాద్‌లో ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించే జూనియర్‌ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి వారికి నగదు పురస్కారాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ సూచించిందన్నారు. ఎన్నికైన వారు తెలంగాణ ప్రో కబడ్డీ సెషన్‌2 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గ్రేడ్‌ఎ క్రీడాకారుడికి రూ. 1.50 లక్షలు, గ్రేడ్‌బి క్రీడాకారుడికి రూ.1,00,000, గ్రేడ్‌సి క్రీడాకారుడికి రూ. 50 వేలు, గ్రేడ్‌డి క్రీడాకారుడికి రూ. 30 వేల పారితోషికం ఇవ్వనున్నారని ప్రకటించారు.

 

Other News

Comments are closed.