125 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

share on facebook

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం వెంకటేశ్వరరావు వివరించారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 125 కొనుగోలు కేంద్రాలు తెరుస్తామన్నారు. గతేడాది మాదిరిగా కాకుండా త్వరితగతిన కొనుగోలు కేంద్రాలను తెరిచి, రైతుల నుంచి

ప్రతి చివరి గింజను కూడా కొంటామన్నారు. ఈ మేరకు గురువారం నుంచి ఆమదాలవలస, రాజాం, పలాసలలో సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాలకు అవసరమయ్యే సామగ్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 2.12 హెక్టార్లలో వరి సాగు కాగా, మంచి దిగుబడులు లభించనున్నాయని, తద్వారా 10.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందన్నారు. ఇందులో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నులు సాంబ రకం ఉత్పత్తి కానుందన్నారు.

Other News

Comments are closed.