నీటి తొట్టెలో పడి రెండేళ్ల బాలుడి మృతి

share on facebook

ఖమ్మం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి అభిరాం(2) అనే బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన చింతకాని మండలంలోని సీతంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌రావు, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు అభిరాం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా నీటి తొట్టెటెలో పడిపోయాడు. ఆ సమయంలో ఎవరు గమనించక పోవడంతో పూర్తిగా నీటిలో మునిగి మృతి చెందాడు. అప్పటివరకు ఆడుకుంటున్న బాలుడు అకాల మృత్యువాత పడటంతో మృత దేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

 

Other News

Comments are closed.