ధర్మాగ్రహ సభలో మండల యూటిఎఫ్‌ నాయకులు

ధర్మాగ్రహసభకు తరలివెళ్లిన యూటిఎఫ్‌

కారేపల్లి: సీపీఎస్‌ విధానం రద్దు విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ధర్మాగ్రహ సభకు కారేపల్లి మండల యూటీఎఫ్‌ నాయకులు తరలి వెళ్ళారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ 43 % ఐఆర్‌ ఇవ్వాలని, సీపీఎస్‌ ను రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్దించాలని, పీఆర్సీ నివేదికను అమలు చేయాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో ఈహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని,కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయ, ఉద్యోగులను పర్మినెంట్‌ వంటి అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ధర్మాగ్రహ సభను నిర్వహించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా రావటంతో సభ విజయవంతమైందని యూటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి బానోత్‌ మంగీలాల్‌ తెలిపారు. ఐక్య పోరాటాల ద్వారా సమస్యలు సాధనకు పోరాటాలు చేయాలని నిర్ణయం జరిగినట్లు పేర్కొన్నారు. సభకు తరలివెళ్లిన వారిలో మండల యూటిఎఫ్‌ నాయకులు డీ.నాగేశ్వరరావు, కృష్ణ, ఏ.లక్ష్మన్‌, ఎస్‌.శ్రీనివాసరాజు, రాంబాబు తదితరులు ఉన్నారు.