14నుంచి సుబ్రమణెళ్యిశ్వర బ్ర¬్మత్సవాలు

share on facebook

విజయనగరం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఈ నెల 14 నుండి 16 వ తేదీ వరకు పూల్‌ బాగ్‌ శ్రీ లక్ష్మిగణపతి కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వార్షిక బ్ర¬్మత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి ప్రకటించారు. సోమవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధాంతి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. బ్ర¬్మత్సవాల్లో పాల్గొనే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 వ తేదీన నవ గ్రహ శాంతి ¬మం, 15 వ తేదీన స్వామి వారికి లక్ష పుష్ప అర్చన, 16 వ తేదీన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి సాయంత్రం 4 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా కృష్ణారావు, కార్యదర్శి శ్రీనివాస గోపాల కఅష్ణ, కోశాధికారి వారణాశి సతీష్‌, ఉపాధ్యక్షులు దన్నాన రామమూర్తి, పైడి రాజు, కన్నబాబు, ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, అగస్త్య శర్మ, ఆర్వీ పంతులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.