14న మెగా లోక్‌ అదాలత్‌

share on facebook

నల్లగొండ,జూలై11(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14న మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తు న్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.తిరుమల్‌రావు తెలిపారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టామని అన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణంలో లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. దీనిలో సివిల్‌, రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, భూ వివాదాలు ఇతర కేసులు పరిష్కారం చేస్తారని తెలిపారు. లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం, ఇరు పక్షాలకు సామరస్య వాతావరణం, అప్పీలుకు తావులేని తీర్పు, కోర్టు ఫీజు వాపసు పొందడం వంటి లాభాలు కలుగుతాయని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

Other News

Comments are closed.