14 నుంచి ఆషాఢ ఉత్సవాలు

share on facebook

విజయవాడ,జూలై12(జ‌నం సాక్షి): విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం దుర్గగుడిలో ఈనెల 14 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఆషాఢమాస ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ వైదిక కమిటీ, స్థానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆషాఢమాసంలో అమ్మవారికి సారె సమర్పించదలచుకున్న భక్తులు, సేవా సంస్థలు, ఇతర దేవాలయాల నిర్వాహకులు, అధికారులు ముందస్తుగా దుర్గగుడికి తెలియజేసి సమయం కేటాయించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 9966003456 ఫోన్‌ నెంబరులో గానీ, టోల్‌ ఫ్రీ నెంబరు 18004259099లో గానీ సంప్రదించాలని వైదిక కమిటీ స్థానాచార్యులు వివరించారు.

———

Other News

Comments are closed.