15 నుంచి ఆర్గానిక్‌ ఫెస్ట్‌

share on facebook

కమ్మసంఘంలో ఐదురోజుల పాటు ప్రదర్శన
హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఆర్గానిక్‌ ఫుడ్‌ను వినియోగించడం అలవాటుగా మారింది. హైదరాబాద్‌ లోని మార్కెట్లలో ఆర్గానిక్‌ ఫుడ్‌ కోసం నగరవాసులు అన్వేషిస్తున్నారు. సేంద్రియ ఆహారమనేది కేవలం నగరంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అవిూర్‌పేట్‌లోని కమ్మసంఘం భవనంలో బిగ్‌ మార్కెటీర్‌ ఆధ్వర్యంలో ‘ఆర్గానిక్‌, మిల్లెట్స్‌ ఎక్స్‌పో’ను ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నగరవాసుల ఆసక్తిని సొమ్ము చేసుకు నేందుకు పలు దుకాణాలు, మాల్స్‌లో ఆర్గానిక్‌ ఫుడ్‌ పేరుతో పెద్ద బ్యానర్లతో కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. దాదాపు 50 మంది ఆర్గానిక్‌ ఫుడ్‌ ఉత్పత్తిదారులు తమ సేంద్రీయ పంట ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఐదు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో ఆర్గానిక్‌, సహజ పంటల తయారీదారులు, రైతులు అందుబాటులో ఉంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వై.వెంకటేశ్వర్‌రావు, అగ్రి ఫ్రెండ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి శివశంకర్‌, డాక్టర్‌ ఖాదర్‌వలీ తదితరులు సంబంధిత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. ప్రజల సమాచారం కోసం ఆర్గానిక్‌, సేంద్రీయ రైతుల విజయగాథలను అక్కడ ప్రదర్శించనున్నారు. సూపర్‌ ఫుడ్‌, జన్యుపరంగా మార్పుచేసిన జీవులు, ఫ్రీ గ్లూటెన్‌, షుగర్‌ లెస్‌, ఆయిల్‌ ఫ్రీ, కొవ్వు లేని ఆహార పదార్థాలు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు తేలింది. వాస్తవంగా ఏది సేంద్రీయ ఆహారం? ఎందుకు అంత ఖరీదు?, ఎందుకు సేం ద్రీయ ఆహారం తినాలి?, నిజంగా ఆరోగ్యకరమా? వంటి అనేక అంశాలకు ఈ ఎక్స్‌పోలో అవగాహన కల్పించనున్నారు.
ఇందులో అన్నిరకాల ఆహార పదార్థాలతో పాటు చెరకు, చమురు విత్తనాలు, తృణధాన్యాలు, మిల్లెట్లు, పత్తి, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, టీ, పండ్లు, మాసాలా దినుసులు, పొడి పండ్లు, కూరగాయలు, కాఫీ తదితరాలు సాగవుతున్నాయి.

Other News

Comments are closed.