16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

share on facebook

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. చింతకాని మండలంలోని జగన్నాథపురం వద్ద శుక్రవారం టాస్క్‌ఫోర్సు అధికారులు దాడి చేసి బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ బియ్యం ఖమ్మం జిల్లానుంచి కృష్ణా జిల్లా వత్సవాయి వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు ఆటోలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.

Other News

Comments are closed.