24గంటల కరెంట్‌తో రైతులకు మేలు

share on facebook

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి రైతులకు 24గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతా రెడ్డి అన్నారు. త్వరలో రైతులకు లేదా వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంట్‌ అందనుందని అన్నారు. దీంతో వ్యవసాయరంగం మరింతగా అభివృద్ది చెంది రైతులకు మేలు జరుగనుందని అన్నారు. సాగు తాగు నీటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నామన్నారు. గోదావరి జలాలతో చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. రైతన్నల కళ్లలో సంతోషం నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నానని అన్నారు. ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నానన్నారు. గతంలో చెరువులన్నీ ఎడారిగా మారి వ్యవసాయ చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. చెన్నూరు రిజర్వాయర్‌ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.

Other News

Comments are closed.