28న హైదరాబాద్‌కు మోదీ

share on facebook

హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శావిూర్‌పేట సవిూపంలోని భారత్‌ బయోటెక్‌ను మోదీ సందర్శించనున్నారు. కొవిడ్‌ నివారణకు సంబంధించి భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకా పురోగతిని పరిశీలించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు రానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే భాజపా జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. 27న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 28న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, 29న కేంద్ర¬ంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ రానున్నారు. వీరంతా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా హైదరాబాద్‌ రానుండటం ఆసక్తికరంగా మారింది.హైదరాబాద్‌ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) సంస్థను సందర్శించనున్నారు. అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న టీకా అభివృద్ధిని ఆయన పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. మోదీ శనివారం సీఐఐ పర్యటనకు సంబంధించి తమకు స్పష్టమైన సమాచారం అందిందని పుణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు తెలిపారు.

Other News

Comments are closed.