450 శైవ క్షేత్రాల్లో మనగుడి

share on facebook

వరంగల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి

జిల్లా వ్యాప్తంగా 450 శైవక్షేత్రాలలో మనగుడి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఏటా కార్తీక మాసంలో టిటిడి సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 20వ తేదీన కైశికద్వాదశి, 21న ఆలయాల శుద్ధి, 22న దీపోత్సవం, 23న తితిదే ప్రసాద వితరణ, భజన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. మన గుడి కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెరుగుతోందన్నారు.

 

 

Other News

Comments are closed.