74 వ రాజీవ్ గాంధీ జయంతి

share on facebook

 జనంసాక్షి  సిద్దిపేట జిల్లా ప్రతినిది (ఆగస్టు 20)

ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 74 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ మరియు టిపిసిసి మైనార్టీ ఉపాధ్యక్షులు వహీద్ ఖాన్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నటువంటి మహానాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ  దేశం కోసం భవిష్యత్తు కోసం యువకుల చేతిలో ఉన్నది అనే ఉద్దేశంతోటి యువకులకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహా వ్యక్తి ఈరోజు లేకపోవడం విచారించదగ్గ విషయం ఈ దేశానికి సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అటువంటి నాయకులు వారి బాటలోనే యువ నాయకుడు రాహుల్ గాంధీ నడుస్తున్న సందర్భంలో యువకులు దేశ ప్రజలు రాబోయే రోజుల్లో రాజీవ్గాంధీ బాటలో నడుస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి 2019లో భావి ప్రధానమంత్రిగా చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉన్నది అని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్అత్తు ఇమామ్ డిసిసి మైనారిటీ కన్వీనర్ మొయినుద్దీన్ డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు పాషా చేపూరి సిద్ధిరాములు గౌడ్ ఫయాజ్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.